బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (23:15 IST)

పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు మరిదితో కలిసి జంప్...

ఇంటికి అందమైన కోడలు వచ్చిందని అందరూ అనుకున్నారు. పెద్ద కొడుకు జీవితం ఇక సాఫీగా సాగిపోతుందని భావించారు. కానీ వచ్చిన యువతి మరిదితో కలిసి జంప్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అంతే కాదు మొగుడుతో మూడురాత్రులు గడిపి నాలుగవ రాత్రి మరిదిని తీసుకుని మరీ పారిపోయింది.

 
ఉత్తరప్రదేశ్ లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతంలోని యువతికి అదే ప్రాంతానికి చెందిన సంతోష్‌కు వివాహమైంది. వీరి పెళ్ళిచూపులు, నిశ్చితార్థం సమయంలో సంతోష్ తమ్ముడు అజిత్ లేడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో విధి నిర్వహణలో ఉండిపోయాడు.

 
ఇక పెళ్ళి సమయానికి సెలవు పెట్టి వచ్చాడు. తన భార్యను సోదరుడు అజిత్‌కు పరిచయం చేశాడు సంతోష్. పెళ్ళై ఒక రాత్రి గడిచిందో లేదో వెంటనే అజిత్ దగ్గరకు వెళ్ళి నువ్వు నాకు నచ్చావ్... మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటూ ప్రపోజ్ పెట్టింది. నువ్వు నాకు కావాలి. మనం జీవితాంతం కలిసి ఉందామని చెప్పింది.

 
అజిత్ షాకయ్యాడు. అయితే అన్న వివాహం చేసుకున్న యువతి నుంచి ఇలాంటి మాటలు రావడంతో తటపటాయించాడు. మూడు రాత్రులు గడిచాయి. ఇంకేముంది నాలుగవ రాత్రి రోజు మాత్రం వివాహిత భర్త గదికి వెళ్ళలేదు. అజిత్‌తో కలిసి పారిపోయింది. ఇప్పటివరకు వీరి జాడ కనిపించలేదు. వీరిద్దరు కలిసి పారిపోతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో భర్త లబోదిబోమంటున్నాడు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.