శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మే 2022 (15:31 IST)

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ప్రజల ఆందోళన.. ఎమెర్జెన్సీ విధింపు

Sri lanka
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. 5 వారాల క్రితం నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడించడంతో హింస చెలరేగడం.. ఎమెర్జెన్సీ విధించడం.. ఆపై వెనక్కి తీసుకోవడం జరిగిపోయాయి. తాజాగా మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది.
 
ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేనే కారణమంటూ దేశ అధ్యక్షుడి ఇంటి వద్ద ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు.
 
ఒక్కోసారి ప్రజల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పరిస్థితులు పోలీసుల చేయి దాటి ఎమెర్జెన్సీ వరకు వెళ్తుంది. ఇప్పుడు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. 
 
పరిస్థితిని అదుపులోకి తేవడానికి రాజపక్సే ఈ కఠినమైన ఎమెర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ద్వారా ఐదు వారాల్లో రెండోసారి భద్రతా బలగాలకు అధికారాన్ని అందించనుంది.