సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 మే 2022 (21:45 IST)

ఆటోలో ప్రముఖ నటి: పోలీసు అసభ్య ప్రవర్తన

ఇటీవల కేరళలోని కొచ్చి నగరంలో ఆటోలో రాత్రి సమయంలో తన స్నేహితురాలు- కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ప్రసిద్ధ మలయాళ నటి, టీవీ హోస్ట్ అర్చనతో అసభ్యంగా ప్రవర్తించినందుకు కేరళ పోలీసు అంతర్గత విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, నటి మరియు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఇద్దరి వెర్షన్‌లు తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

 
రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని, ఆమె ముఖానికి మాస్క్ ధరించి ఉన్నందున అతను నటిని గుర్తించలేకపోయాడు. ఒక సెలబ్రిటీ లేదా సాధారణ మహిళ అయినా, చట్టాన్ని అమలు చేసే వారి వైపు నుండి ఇటువంటి అసభ్య ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని కొచ్చి డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

 
పోలీసు అధికారిని మరోసారి పిలిపించి, అవసరమైతే అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. నటి అర్చన ఇటీవల తన మహిళా స్నేహితులతో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.