శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (11:33 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సౌండింగ్ రెస్పాన్స్

Vijay Devarakonda, ananya
Vijay Devarakonda, ananya
తెలుగు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎక్క‌డికి వెళ్ళినా అభిమానులు రెస్సాన్స్ మామూలుగా లేదు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో త‌న సినిమా లైగ‌ర్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆర్‌.టి.సి. క్రాస్ రోడ్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు రావ‌డంతో ఊహించ‌ని జ‌నాలు వ‌చ్చారు. బైక్ ర్యాలీకూడా నిర్వ‌హించారు. ఆగ‌స్టు 25న సినిమా విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌నాళిక ప్ర‌కారం విజ‌య్‌ను ప‌లు రాష్ట్రాల‌కు పంపుతున్నారు. 
 
Liger mumbai
Liger mumbai
నిన్న రాత్రి ముంబైలోని మాల్ సందర్శనలో లైగ‌ర్ టీమ్‌కి మళ్లీ సౌండింగ్ రెస్పాన్స్ అంటూ.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్‌. ఊహించ‌ని రెస్పాన్స్ రావ‌డం విశేషం. ఒక‌ప్పుడు బాలీవుడ్ హీరోల‌కున్న పాపుర‌ల్ విజ‌య్‌కు రావ‌డం ప్ర‌త్యేకంగా చెబుతున్నారు. తాను ఇంత‌కుముందు చెత్త సినిమాలో న‌టించాన‌ని ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ప్ర‌క‌టించారు. గీత‌గోవిందం, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి సినిమాల‌ త‌ర్వాత ఆయ‌న‌కు అంత స‌క్సెస్ రేటు పెద్ద‌గాలేదు. అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్ ఆయ‌న్ను ప‌లు సినిమాలు చేసేలా చేసింది. మ‌రి లైగ‌ర్ సినిమా ఏ రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుందో చూడాల్సిందే.