సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:08 IST)

ర‌ష్మిక రాజ‌కీయాల్లో రాణిస్తుందన్న జ్యోతిష్కుడు (video)

Rashmika Mandanna
Rashmika Mandanna
రష్మిక మందన్నకు న‌ట‌నారంగంలోకాకుండా రాజ‌కీయాల్లోనూ రాణిస్తుంది. ఆమెకు యోగ‌ముంది. భ‌విష్య‌త్‌లో పార్ల‌మెంట్ స‌భ్యురాలు అవుతుంద‌ని హైద‌రాబాద్‌కుచెందిన వేణు స్వామి తెలియ‌జేస్తున్నాడు. ఇత‌ను సినిమారంగంలో ప్ర‌ముఖుల‌కు జాత‌కాలు చెప్ప‌డ‌మేకాకుండా సినిమా షూటింగ్‌ల‌కు ముహూర్తాలు పెడుతుంటారు. కొన్నాళ్ళ త‌ర్వాత వాటికి దూరంగా వున్నాడు. ప్ర‌స్తుతం త‌న య్యూట్యూబ్ ఛాన‌ల్‌లో సినీరంగ ప్ర‌ముఖుల పుట్టిన‌తేదీ, జాత‌కాల‌నుబ‌ట్టి ర‌క‌ర‌కాలుగా చెబుతుంటాడు.

 
2020లో ఓ మ‌హ‌మ్మారి రోగం వ‌స్తుంద‌ని తాను చెప్పాన‌ని అప్ప‌ట్లో వీడియో విడుద‌ల చేశాడు. అలాగే స‌మంత‌ను నాగ చైతన్య పెండ్లి చేసుకోబోతున్నార‌ని తెలిసిన త‌ర్వాత వారు విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ప్ర‌ముఖ హీరోల‌తో న‌టిస్తున్న ర‌ష్మిక తాజాగా పుష్ప‌తో ఫేమ‌స్ అయింది. ఇక ఈనెల 5న విడుద‌ల‌కాబోతున్న సీతారామంలో న‌టించింది. ఆ పాత్ర‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని ర‌ష్మిక చెబుతోంది. 

 
కాగా, ఓ సంద‌ర్భంలో త‌న‌ను క‌లిసిన ర‌ష్మిక‌కు కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టితో రిలేషన్‌ షిప్‌ మానుకోమని అప్పట్లో నేను ఆమెకు సలహా ఇచ్చాను.. ఆ రిలేషన్‌షిప్‌ మానేసిన తర్వాత ఆమె నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఆమె జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో చేరి ఎంపిగా మార‌నుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి ఇది ఎంత నిజ‌మ‌వుతుందో చూడాల్సిందే.