సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (22:48 IST)

విజయ్ సినిమాలో సమంత లేడీ విలన్.. ఫవర్ ఫుల్ రోల్‌లో అదరగొడుతుందా?

samantha
సమంత రూటు మార్చింది. హీరోయిన్‌గా, లేడి ఓరియెంటెడ్ రోల్‌, ఐటమ్ గర్ల్‌గా అదరగొట్టిన సమంత రూతు ప్రభు.. ప్రస్తుతం విలన్ అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యింది. సమంత నాగచైతన్య నుంచి ఎప్పుడైతే విడాకులు తీసుకుందో విభిన్న పాత్రలు చేసేందుకు సిద్ధం అవుతోంది. 
 
పుష్ప ఐటమ్ సాంగ్‌తో ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఏకంగా విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఈమె వెనకాడటం లేదు. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెలుగులో నటిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక సందడి చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో సమంత లేడీ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 
 
ఈ సినిమాలో ఈమె ఫుల్ లెన్త్ విలన్ పాత్రలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే సమంత ఇదివరకే విక్రమ్ నటించిన 10లో కొంత నిడివి నెగెటివ్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం విజయ్ సినిమాలో ఏకంగా ఫుల్ లెంత్ విలన్ పాత్రలో సమంత సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.