1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. No Monkeypox to Vijayawada Toddler says Health Commissioner

విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ కాదు.. చర్మంపై దద్దుర్లే

monkeypox
దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడకు వచ్చిన ఓ బాలికకు మంకీపాక్స్ సోకినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అలాగే, ఆ చిన్నారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలే‌షన్‌కు ఉంచారు. అదేసమయంలో ఆ చిన్నారి నుంచి నమూనాలు సేకరించి పూణెలోని వైరాలాజీ ల్యాబ్‌కు పంపించారు 
 
అక్కడ జరిగిన ప్రయోగాల్లో ఆ చిన్నారికి సోకింది మంకీపాక్స్ కాదని చర్మంపై దద్దుర్లేనని తేలింది. ఈ విషయాన్ని విజయవాడ వైద్యులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. కాగా, కేరళలో మంకీపాక్స్ కేసు వెలుగు చూసిన విషయం తెల్సిందే. దీంతో దీన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు..