ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (15:29 IST)

ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 51 మందికి మంకీ ఫాక్స్.. దేశంలోనూ మంకీఫాక్స్ కలకలం

monkey fox
monkey fox
పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీఫాక్స్ వైరస్ ఇపుడు భారత్‌లోకి ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ జిల్లాలోకు చెందిన ఐదేళ్ల బాలికకు ఈ వైరస్ సోకింది. దీంతో ఆ చిన్నారి నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలో కోసం పంపారు.  
 
మరోవైపు ఫ్రాన్స్‌లో ఏకంగా 51 మంది ఈ వైరస్ సోకింది. అదీ కూడా ఈ కేసులన్నీ ఒక్క రోజే నమోదు కావడం ఇపుడు ఆందోళనకు గురిచేస్తుంది. బుధవారం నాటికి 33గా ఉన్న ఈ కేసుల సంఖ్య గత రెండు రోజుల్లోనే వంద సంఖ్యను దాటిపోయింది. ఈ వైరస్ బాధితులంతా మగవారేనని, వీరిలో 22 నుంచి 63 యేళ్ళ వయస్కులు ఉన్నారని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తెలిపింది. 
 
ఇదిలావుంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700కు పైగా మంకీపాక్స్ కేసులు వచ్చాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. అమెరికాలో 21 మంది, కెనడాలో 77 మందికి ఈ వైరస్ సోకినట్టు తెలిపింది.