గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (11:12 IST)

యూపీలో మంకీ ఫాక్స్ కలకలం.. ఐదేళ్ల బాలికలో లక్షణాలు

ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన మంకీపాక్స్‌ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. శుక్రవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 51 మందికి పాజిటివ్‌ వచ్చింది. అమెరికాలో ఇప్పటివరకు 21 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. అయితే మంకీపాక్స్‌ రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో మనదేశంలో మంకీ ఫాక్స్ కలకలం మొదలైంది. తాజాగా యూపీలో మంకీ పాక్స్ విజృంభిస్తోంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ ఐదేండ్ల బాలిక మంకీపాక్స్‌ లక్షణాలతో బాధపడుతుంది. దీంతో అధికారులు ఆమె నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తన ఒంటిపై దురద, దద్దుర్లు వస్తున్నాయని వైద్యులను చిన్నారి సంప్రదించిందని ఘజియాబాద్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు.
 
కాగా, ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవని చెప్పారు. అదేవిధంగా ఆమెకు దగ్గరి సంబంధికులు ఎవరూ గత నెలరోజుల్లో విదేశాల్లో పర్యటించలేదని వెల్లడించారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆమె నుంచి నమూనాలు సేకరించామన్నారు.