1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (18:09 IST)

టాలీవుడ్ చందమామకు పండంటి మగబిడ్డ పుట్టాడోచ్?

Kajal Agarwal
అవును. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని కాజల్ కుటుంబ సభ్యులు గానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
 
మంగళవారం ఉదయం కాజల్ చెల్లెలు, ఒకప్పటి కథానాయిక నిషా అగర్వాల్ అక్క డెలివరీ గురించి హింట్ ఇచ్చారు. "స్పెషల్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నిషా అగర్వాల్ పోస్ట్ చేశారు. అయితే... అసలు విషయం చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు.
 
గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ఈ ఏడాది జనవరిలో తాను ప్రెగ్నెంట్ అని కాజల్ వెల్లడించారు. అయితే కాజల్‌కు మగశిశువు పుట్టాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేలతో కలిసి ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ నటించింది. ప్రెగ్నెంట్ కారణంగా కాస్త ఈ సినిమా నుంచి విరామం తీసుకుంది. ఏప్రిల్ 29న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.