శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:49 IST)

భార్యతో గొడవలు.. స్నేహితులతో కలిసి రేప్ చేయించాడు..

woman
భార్యాభర్తల మధ్య గొడవలు సామాన్యం. అయితే భార్యతో ఏర్పడిన గొడవలతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నిలంగా ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయంలో ఒక ఇంటిని నిర్మించుకుని దానిలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
దీంతో విసిగిపోయిన భర్త.. భార్యను ఆమె పుట్టింటికి వెళ్లి వదిలేసివచ్చాడు. పుట్టింటికి వెళ్లిన భార్య మళ్లీ మెట్టింటికి వెళ్లింది. కానీ ఇద్దరి మధ్య గొడవులు ఆగలేదు. దీంతో విచక్షణను కోల్పోయాడు. 
 
వెంటనే తన భార్యను గదిలో బంధించి, తన పొలం యజమాని, అతని సోదరుడితో కలిసి భార్యపై అత్యాచార అఘాయిత్యం చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.