1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:42 IST)

అల్పాహారం ఆలస్యంగా చేసిందనీ కోడలిని కాల్చి చంపిన మామ!!

gunshoot
ఉదయం వేళ అల్పాహారం ఆలస్యం చేసిందన్న కోపంతో ఇంటి కోడలిని మామ కాల్చి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేకు చెందిన కాశీనాత్ పాటిల్ (76) అనే వ్యక్తి ఓ పారిశ్రామికవేత్త. ఈయన కోడలు పేరు సీమా రాజేంద్ర. 
 
అయితే, గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం, ఆయనకు వడ్డిచండంలో జాప్యమైంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. 
 
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించగా, శుక్రవారం కన్నుమూసింది దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు.