ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (17:27 IST)

డేవిడ్ వార్నర్ బాంగ్రా డ్యాన్స్ అదుర్స్.. (Video)

Warner
ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య జరగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఆటలో ఫీల్డింగ్ సమయంలో డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అది కూడా పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన పంజాబీ డ్యాన్స్ చేయడం విశేషం. చేతులు పైకెత్తి, నడుస్తూ స్టెప్పులేసి వార్నర్ ఆకట్టుకున్నాడు.   
 
35 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఇప్పటికే తెలుగు పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా డైలాగులను ఇమిటేట్ చేశాడు. తెలుగు హిరోల ఫేస్‌లను మార్ఫింగ్ చేసిన తన ఫేస్‌తో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నాడు.  
 
ఇక పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 476 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 459 పరుగులు చేసింది. 
 
అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 200 పరుగులు దాటిన వికెట్ కోల్పోలేదు. కాగా ఆటకు మంగళవారమే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయమైపోయింది.