సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్ - ఏడుగురు మృతి

road accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి అంబులెన్స్‌‍లో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.