గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 జులై 2022 (17:23 IST)

మృణాళినీగా భూమిక చావ్లా

Bhumika Chawla
Bhumika Chawla
యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ 'సీతారామం'. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె  బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు.
 
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.