ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (16:03 IST)

పుష్ప 3 పార్ట్‌కూడా సిద్ధ‌మ‌వుతోంది

Pushpa
Pushpa
అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌` ఎంత‌టి క్రేజ్ సంపాదించిందో తెలిసిందే. ఏకంగా బాలీవుడ్‌లోనూ పుష్ప పేరుతో మెగా సీరియ‌ల్ న‌డుతోంది. ఇక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పుష్ప‌2 షూటింగ్‌లో పోలీసు అధికారిగా ఫహద్ ఫాజిల్ న‌టించాడు. బాలీవుడ్‌లో ఓ ఇంట‌ర్వ్యూలో పుష్ప‌3 పార్ట్ కూడా వుంటుంది. రెడీగా వుండ‌ని సుకుమాన్ త‌న‌తో అన్న‌ట్లు వెల్ల‌డించాడు. దాంతో తొలిసారి తెలుగులో మూడు భాగాలుగా వ‌స్తున్న చిత్రం సుకుమార్‌దే కావ‌డం విశేషం.
 
తెలుగులో మ‌నీ పేరుతో మూడుర‌కాలుగా మూడు సినిమాలు వ‌చ్చాయి. కానీ ఒకే పేరుతో ఇలా రావ‌డం విశేషం. బాహుబ‌లి కూడా చేయాల‌ని రాజ‌మౌళికి అనిపించ‌లేదు. కానీ ఒక్కోసారి మూడు భాగాలు క‌థ‌ను న‌డిపేవిధానం బాగుంటే హైలైట్ అవుతుంద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రు ఈ రెండో భాగం చూశాక కానీ మూడో భాగం ఎంత‌మేర‌కు అవ‌స‌ర‌మో చెప్ప‌లేమ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ మైండ్‌లో ఏమి వుందో త్వ‌ర‌లో బ‌య‌ట పెట్ట‌నున్నారు.