ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (12:31 IST)

పుష్ప-2లో విజయ్ సేతుపతి

pushpa
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు. 
 
పుష్ప ది రూల్ అనే టైటిల్‌తో రాబోతున్న సెకండ్ పార్ట్‌పై ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 
 
నిజానికి పుష్ప మొదటి భాగంలో గోవిందప్ప విజయ్ నటించాల్సిందని.. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు పుష్ప ది రూల్ లో కీలకపాత్రలో మక్కల్ సెల్వన్ కనిపించనున్నాడని తెలుస్తోంది.