దేశంలో కొత్తగా 16135 కరోనా పాజిటివ్ కేసులు  
                                       
                  
                  				  దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3.32 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఇందులో 16135 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కొత్త కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
				  											
																													
									  
	 
	ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
				  
	 
	కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసులు 1,13,864కి చేరాయి. క్రియాశీల రేటు 0.26 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.53 శాతానికి పడిపోయింది. ఆదివారం 13,958 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తంగా 5.25 లక్షల మందికిపైగా మరణించారు.