1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

జూలై నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవు!

bank holiday
2022 సంవత్సరం వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. ఏడో నెలలోకి అడుగుపెట్టాం. జూలై ఒకటో తేదీ శుక్రవారం నుంచి నెలాఖరు వరకు బ్యాంకులకు ఉన్న సెలవుల వివరాలను తెలుకుందాం. ఈ నెలలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులు మూసివుంటాయి. 
 
వీటిలో జూలై 9వ తేదీన బక్రీద్ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో పాటు ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ  సెలవుల వివరాలను పరిశీలిస్తే,
 
జూలై 1వ తేదీ కాంగ్ పండుగ (భువనేశ్వర్ - ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు)
జూలై 3వ తేదీ ఆదివారం
జూలై 7వ తేదీ దైపూజలు (దేశ వ్యాప్తంగా)
జూలై 9వ తేదీ బక్రీద్, రెండో శనివారం (దేశమంతా)
జూలై 10వ తేదీ ఆదివారం 
జూలై 11వ తేదీ దేశమంతా 
జూలై 13వ తేదీ భాను జయంతి (గ్యాంగ్‌టక్)
జూలై 14వ తేదీ బెన్‌డయంక్లామ్ (షిల్లాంగ్)
జూలై 16వ తేదీ హరెలా (డెహ్రాడూన్)
జూలై 17వ తేదీ ఆదివారం 
జూలై 23వ తేదీ నాలుగో శనివారం (దేశ వ్యాప్తంగా)
జూలై 24వ తేదీ ఆదివారం 
జూలై 26వ తేదీ కెర్‌పూజ (అగర్తల)
జూలై 31వ తేదీ ఆదివారం