తెలంగాణకు ప్రధాని.. స్పెషల్ మెను.. హైదరాబాదుకు యాదమ్మ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముస్తాబవుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ, జాతీయ స్థాయి నాయకులు, అతిరథ మహారథులకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పెషల్ ఏర్పాటు చేస్తుంది.
జులై 2,3 తేదీల్లో జరగబోయే బీజేపీ స్పెషల్ మీట్‌కు స్పెషల్ మెను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ స్పెషల్ మీట్‌లో తెలంగాణ స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
ఈ స్పెషల్ మెనులో మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు ఉండేలా చూస్తున్నారు. పచ్చిపులుసు, పంటికూర పప్పు, గంగవాయిలి- మామిడి పప్పు, తెల్లజొన్నరొట్టెలు, బూందీలడ్డూను ఆల్ మోస్ట్ మెనులో చేర్చారు. సాయంత్రం స్నాక్స్‌గా సర్వపిండి, సకినాలు, గారెలు వడ్డించనున్నారు. ఇప్పటికే ఈ వంటల్లో కరీంనగర్‌కు చెందిన యాదమ్మ ఆయా పరిసరాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్పెషల్ మెనునూ సిద్ధం చేసేందుకు కరీంనగర్ నుంచి యాదమ్మను హైదరాబాద్‌కు రప్పించారు. యాదమ్మతో పాటు నోవాటెల్ చెఫ్‌లతో బండి సంజయ్ ఇప్పటికే భేటీ అయ్యారు. వంటకాలు అదరహో అనేలా ఉండాలని చెఫ్ లకు సూచించినట్లు తెలుస్తుంది.