సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (12:22 IST)

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్

dost notification
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ బుధవారం విడుదలకానుంది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేస్తారు. దీనిద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్శిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల సీట్లను భర్తీ చేయనున్నారు. 
 
సంప్రదాయ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులకు సంబంధించి దాదాపు 4.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని విడదలవారీగా భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్‌సైట్, టీఎస్ ఫోలియో యాప్, యూనివర్శిటీల వైబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.