గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (10:15 IST)

చురుకుగా కదులుతున్న రుతుపవనాలు - నేడు భారీ వర్షాలు

rain
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా కదలుతున్నాయి. దీంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపంది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఉన్నట్టు పేర్కొంది. 
 
నిజానికి రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తూనే వుంది. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాదా, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలోని నేరేడ్‌మెట్‌లో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.