గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (12:00 IST)

ఇంటర్ పరీక్షా ఫలితాలు - అమ్మాయిలదే పైచేయి...

inter results
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా అమ్మాయిలదే పైచేయింగా నిలిచింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. 
 
ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63.32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 
 
ఫస్టియర్‌లో 72.33 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో మాత్్రం కేవలం 54.25 శాతం మంది మాత్రమే పాసయ్యారు. 
 
అలాగే, ద్వితీయ సంవత్సరంలో 59.21 శాతం మంది అబ్బాయిలు, 75.28 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సర ఫలితాల్లోనూ అమ్మాయిలో తమ హవాను కొనసాగించారు. 
 
ఈ ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.