శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (13:05 IST)

రెండు తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ - ఐఎండీ హెచ్చరిక

rain
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ హెచ్చరిక జారీచేసింది. వచ్చే రెండో రోజుల పాటు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళ, బుధవారాల్లో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. 
 
ముఖ్యంగా, ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉరుములో కూడిన వర్షపు జల్లులు కురుస్తాయని తెలిపింది. అదేసమయంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అధికంగా పిడుగులు పడుతాయని పేర్కొంది.