గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (16:20 IST)

వచ్చేనెల ఒకటో తేదీన టెట్ పరీక్షా ఫలితాలు

sabita indra reddy
తెలంగాణా రాష్ట్రంలో టెట్ పరీక్షా ఫలితాలను వచ్చే నెల ఒకటో తేదీన వెల్లడించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆమె మంగళవారం ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఉర్హత పరీక్షా ఫలితాలను వెల్లడించే తేదీని కూడా ప్రకటించారు. 
 
నిజానికి ఈ టెట్ ఫలితాలు ఈ నెల 27వ తేదీ సోమవారం వెల్లడి కావాల్సివుంది. కానీ సోమవారం రాత్రి వరకు ఈ ఫలితాలను వెల్లడించలేదు. 
 
ఈ నేపథ్యలో మంగళవారం ఈ విషయంపై దృష్టిసారించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ ఒకటో తేదీన ఫలితాలను వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఈ టెట్ పరీక్షల్లో భాగంగా, మొదటి పేపర్‌కు 318506 మంది, రెండో పేపర్‌కు 251070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు.