Allu Arjun: అల్లు అర్జున్ టీమ్ కావేరి బారుహ్ పై చర్య తీసుకుంటుందా? తప్పెవరిది?
Allu Arjun, , Kaveri Baruh
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఐకాన్ స్టార్ గా సుకుమార్ బిరుదు ఇచ్చి మరింత స్టార్ ను చేశారు. ఆ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో థియేటర్ లో జరిగిన సంఘటన ఇంకా జనాలు మర్చిపోలేదు. తాజా అల్లు అర్జున్ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ పాడ్‌కాస్ట్ నుండి ఒక చిన్న వీడియో క్లిప్ అల్లు అర్జున్ గురించి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో వైరల్ అయింది.
ఆ క్లిప్‌లో, అతిథి, బ్రాండ్ మేనేజర్ కావేరి బారుహ్, అల్లు అర్జున్ బృందం ఇంటర్వ్యూలకు ముందు 42 రూల్స్ పెట్టారు. అల్లు అర్జున్ మేనేజర్ కమ్ మేనేజర్ కమ్ మేనేజర్ కమ్ మేనేజన్ అంటూ 4,5 సార్లు ఆమె చెప్పింది. చివరి మేనేజర్ ఎవరో కానీ ఆయనకు అంతమంది మేనేజర్లు వున్నారని లోకానికి తెలిసింది. ఆమెకు మేనేజర్లు చెప్పినదాన్ని బట్టి. హీరో కల్ళల్లో కల్లుపెట్టి ఎక్కువసేపుచూడకూడదు. షేక్ హ్యాంక్ ఇవ్వకూడదు. అంటూ దాదాపు ఓ చిట్టా నా ముందుంచారని అన్నారు. ఆమెను ఇంటర్వూ చేస్తున్న యాంకర్ కూడా సౌత్ హీరోల్లో ఇలాంటి వారున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇక ఇది వైరల్ అవుతుండడంతో.. వెంటనే స్పందించిన అల్లు టీమ్ ఓ లిఖితపూర్వక మెసేజ్ మీడియాకు అందజేసింది. ఆమె వాదనలు నిరాధారమైనవి, పరువు నష్టం కలిగించేవి అని పేర్కొంది. ఆరోపణలు ఏవీ నిజం కాదని అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చాలా మంది ఈ విషయం అక్కడితో ముగిసిపోతుందని భావించారు. బదులుగా, పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి అగ్నికి ఆజ్యం పోసింది. తన అతిథి (కావేరి బారుహ్) అల్లు అర్జున్ పిఆర్ మెషినరీ మరియు బాట్ ఖాతాల నుండి వేధింపులను ఎదుర్కొన్నారని పేర్కొంటూ ఆమె వీడియోను తొలగించినట్లు ప్రకటించింది. ఇది ఎలా సద్దుమణుగుతుందో చూడాలి. అయితే దీనిపై ఓ నెటిజన్ ఆసక్తి కామెంట్ చేశాడు. ఎస్.కె.ఎన్. చెప్పి ఉంటాడు మావాడు మెగాస్టర్ హైదరాబాద్ అని. 42 do's and don'ts. స్క్రీన్ ముందే ఇలా నవ్వుకుంటున్నారు అంటే ఇంక స్క్రీన్ వెనక ఏరేంజ్ కామెడీ చేసుకొని ఉంటారు? పుష్ప తరువాత ఆ 42 కాస్త 82 అయి ఉంటాయి. అని పేర్కొన్నాడు.