మరోచరిత్రలాంటి సినిమా తీయలేకపోయా- అశ్వనీదత్
అగ్రహీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశాను. కానీ ప్యూర్ ప్రేమకథతో సినిమా తీయలేదు. ఆ లోటు `సీతారామం` తీర్చింది అని వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ అన్నారు. సోమవారంనాడు చిత్ర ట్రైలర్ హైదరాబాద్‌లో విడుదలచేశారు. ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ, ఎన్నో హిట్లు ఇచ్చాను. కానీ మరోచరిత్ర, గీతాంజలి లాంటి సినిమాలు చూసినప్పుడు ఇలాంటి ప్రేమకథను తీయాలనిపించేది. కానీ సాధ్యపడలేదు. ఇప్పటికి కుదిరింది. అదే సీతారామం అని తెలిపారు.
హీరోయిన్ రష్మిక మండన్న మాట్లాడుతూ, నేనింతవరకు చేయని పాత్ర ఇందులో చేశాను. రెబల్‌గానూ వైటెంట్‌గాను నా పాత్ర వుంటుంది. ఈ కథ విన్నప్పుడు నన్ను ఏ షేడ్‌లో చూస్తారోలేదోనని దర్శకుడు హను రాఘవపూడితో చెప్పాను. తప్పకుండా చూస్తారని చెప్పారు. ఈరోజు ట్రైలర్‌లో నా పాత్ర ఎలా వుంటుందో తెలిసిపోయింది. రేపు థియేటర్లలో మీరు చూసి ఎంకరేజ్ చేయండి అని తెలిపారు.
దుల్కన్ సల్మాన్ మాట్లాడుతూ, చక్కటి ప్రేమకథా చిత్రం దృశ్యకావ్యంగా వుంటుందని తెలిపారు. సుమంత్ మాట్లాడుతూ, 150 పేజీలు చదివాక నాకు మంచి దృశ్యకావ్యంగా అనిపించింది. నేను గతంలో సీతారాముల కళ్యాణం చేశాను. అలాగే ఇప్పటి జనరేషన్ సీతారామం అని చెప్పారు.