శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (14:52 IST)

కత్రినా కైఫ్‌ దంపతులను చంపుతామంటు బెదిరింపులు...

katrina - vicky
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ దంపతులను చంపుతామంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కత్రినా భర్త విక్కీ కౌశల్ ముంబై శాంతాక్రజ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులకు విక్కీ రాసిచ్చిన ఫిర్యాదులో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇన్‌స్టా ఖాతా ద్వారా తమను బెదిరిస్తూ, బెదిరింపు ఇమేజ్‌లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తి కత్రికా కైఫ్‌ను వెంబడిస్తున్నట్టు విక్కీ పేర్కొన్నారు. 
 
విక్కీ కౌశల్ ఇచ్చి ఫిర్యాదు మేరకు ముంబై శాంత్రాక్రజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు గత యేడాది డిసెంబరు 9వ తేదీన మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. ఈ జంట ఇటీవల మల్దీవుల విహారయాత్రకు వెళ్లి స్వదేశానికి వచ్చింది.