గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (16:41 IST)

దేశంలో మంకీపాక్స్ ప్రమాదం ఘంటికలు - బెంగుళూరు, కేరళల్లో అలెర్ట్

monkeypox
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. దాదాపు 16 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. అదేసమయంలో మన దేశంలో కూడా ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై, అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.
 
ఇందులోభాగంగా కేరళ, బెంగుళూరు రాష్ట్రాల్లో హైఅలెర్ట్ ప్రకటించింది. అలాగే, ఈ రెండు విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశితంగా తనిఖీ చేసేందుకు, వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన ఆస్పత్రుల్లో మంకీపాక్స్ రోగులకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటుచేశారు. 
 
ప్రస్తుతం మన దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళ రాష్ట్రంలోనూ, ఒకటి ఢిల్లీలో నమోదైవున్నాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై గత ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసింది.