Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్
2022లో విడుదలై భారీ విజయం సొంతం చేసుకుని, నేషనల్ అవార్దు దక్కించుకున్న కాంతారకు ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి భారీ విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా దసరా సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాంతారా చాప్టర్ 1. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార చాప్టర్ 1 తెరకెక్కింది.
ఈ చిత్రంపై పాజిటివ్ రివ్యూ, కామెంట్స్ వచ్చేశాయి. తాజాగా కాంతారాపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా తన రివ్యూను పోస్టు చేశారు. కాంతారా చాప్టర్ 1 టీమ్‌ను అభినందించారు.
రిషబ్‌శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని వెండితెరపై చూపెట్టాడని.. ఆయన నమ్మకంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన హోంబలే ఫిల్మ్స్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.. అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన తారక్ కాంతారను ఈ స్థాయిలో తెరకెక్కించడం రిషబ్‌కు మాత్రమే సాధ్యమని కొనియాడిన సంగతి తెలిసిందే.
కాంతార చాప్టర్ 1 సినిమా రిలీజ్‌కు తర్వాత పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1ను తెరపై చూసి.. షో ముగిశాక కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సినిమాను రిషబ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆ ఫలితాన్ని వెండితెరపై చూశాక ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అదేవిధంగా తారక్, రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఓ శివాలయాన్ని సందర్శించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను తారక్ ఫ్యాన్స్, రిషబ్ ఫ్యాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు.