వారాహి వాహనంపై రోడ్లపై తిరుగుతాను.. మీ ముఖ్యమంత్రిని రమ్మను ఆపేందుకు...
"వారాహి వాహనంపై ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను.. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను.. ఈ కూసే గాడిదలను రమ్మను.. నా వారాహిని ఆపండి.. నేనేంటో అపుడు చూపిస్తా" అంటూ వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సవాల్ విసిరారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర జరిగింది. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తూ, వైకాపా నేతను తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని, వారానికి ఒక రోజు వస్తేనే తట్టుకోలేకపోతున్నారన్నారు. తన వద్ద తాతలు సంపాదించిన డబ్బు లేదన్నారు.
అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు లేదన్నారు. తనకు వేల కోట్లు, వందల కోట్లు ఇచ్చిన నాయకులు ఎవరూ లేరన్నారు. చిన్నచిన్నవాళ్లు, కొత్తవాళ్లు, ఇంకా అధికారం చూడని వ్యక్తులు సమూహమే తన వద్ద ఉందన్నారు. అందుకే వ్యూహం సంగతి తనకు వదిలివేయాలని, వైకాపా వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తేలేదన్నారు. అందుకు తాను కట్టుబడివున్నానని చెప్పారు.
పైగా ఈ వేదికపై నుంచి ఒక్క మాట చెబుతున్నా... నా మీద లాఠీపడితే రత్కం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. జైల్లో కూర్చోవడానికి కూడా వెనుకాడను. నా సినిమాలు ఆపేస్తావా.. ఆపేసుకో.. నన్ను ఏమీ చేయలేవు. నువ్వు కొట్టే కొద్దీ పైకి లేస్తానేగానీ కిందపడేది లేదని పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి వేదికగా గర్జించారు.