1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Kalyan will come to Sattenapalle

నేడు సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు సభ - హాజరుకానున్న జనసేనాని

pawan kalyan
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ అధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టనుంది. ఇందులో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో జనసేన కౌలు భరో యాత్రను చేపట్టింది. ఇందులో పవన్ కళ్యాణ్ హాజరవుతుండటంతో పార్టీ ఏర్పాట్లు భారీగా చేసింది. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 200 మందికి కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు సమాచారం. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థిక సాయం చెక్కులను పవన్ కళ్యాణ్ ప్రధానం చేస్తారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం. ఇదిలావుంటే, ఈ నియోజకవర్గానికి చెందిన అనేక వైకాపా నేతలు ఆదివారం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అర్థరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు .. ఎక్కడ?