గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:49 IST)

పుష్ప-2 : చిట్టిబాబు క్యారెక్టర్‌లో చెర్రీ

pushpa movie still
పుష్ప-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం సుకుమార్ భారీగా కసరత్తులు చేస్తున్నాడు. అగ్ర నటులను సుక్కు ఈ సినిమాలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. 
 
తాజాగా ఈ సినిమాలో రాంచరణ్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడని తెలిసింది. అది కూడా చెర్రీ కెరీర్‌లో బెస్ట్ పాత్ర అయిన చిట్టిబాబు క్యారెక్టర్‌లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చెర్రీ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా చిట్టిబాబు క్యారెక్టర్‌ను పుష్ప పార్ట్-2కి సుక్కు లింక్ చేయబోతున్నారని సమాచారం. 
 
రంగస్థలం, పుష్ప రెండు కూడా 1980లో జరిగే కథాంశాలు కావడంతో పుష్ప యూనివర్స్ క్రియేట్ చేసేందుకు సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. ఇక సుక్కు తరువాతి సినిమా  కూడా చెర్రీతోనే ఉండటంతో ఈ వార్తలు నిజమేనని ఇండస్ట్రీ  సర్కిల్స్‌లో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.