సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (14:38 IST)

ఆరోగ్యంగానే వున్నా, డబ్బింగ్‌కు వెళుతున్నా : శరత్‌ కుమార్‌

Sarath Kumar
Sarath Kumar
సుప్రీం స్టార్‌ శరత్‌కుమార్‌ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో జేరారనీ, ఎడతెరిపిలేకుండా షూటింగ్‌లో పాల్గొనడం వల్ల డీహైడ్రేషన్‌ వచ్చిందని పలు మీడియాలలో కథనాలు వచ్చాయి. అయితే తనకు ఎటువంటి అనారోగ్యం కలగలేదని, నేను బాగానే వున్నానని సోమవారంనాడు ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. చెన్నైలోని తన ఇంటినుంచి డబ్బింగ్‌కు వెళుతున్నట్లు చెప్పారు. వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. అయినప్పటికీ డబ్బింగ్‌ చెపాల్సివచ్చింది. తన ఆరోగ్యం గురించి వస్తున్న కథనాలు విని నాకు ఆశ్చర్య కలిగిందని హైదరాబాద్‌లోని శరత్‌ కుమార్‌ పి.ఆర్‌.ఓకు తెలియజేస్తున్నారు.
 
హైదరాబాద్‌ టు చెన్నై పలుసార్లు షూటింగ్‌ పనిమీద తిరుగుతున్నాను. ఈ క్రమంలో అసలు తన ఆరోగ్యం గురించి ఇంత రాద్దాంతం ఎందుకు జరిగిందో తెలియదని శరత్‌కుమార్‌ చెప్పినట్లు పి.ఆర్‌.ఓ. వెల్లడించారు. తాజాగా విఘ్నేష్‌రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పోర్తోజిల్‌ అనే సినిమాలో ఆయన నటించారు. ఆ సినిమా డబ్బింగ్‌ కోసం చెన్నైలో తన ఇంటి నుంచి బయలుదేరుతున్నట్లు వర్షం పడుతుండగా దానిని తన అసిస్టెంట్‌కు చూపిస్తూ మాట్లాడుతున్న వీడియోను శరత్‌కుమార్‌ పోస్ట్‌ చేశారు.