మంగళవారం, 18 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 అక్టోబరు 2025 (14:36 IST)

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

Explosion at fireworks
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. లైసెన్స్ పొందిన క్రాకర్స్ తయారీ యూనిట్‌లో మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఇప్పటివరకూ ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల వివరాలను కనుగొనే పనిలో వున్నట్లు చెప్పారు. బాణసంచా తయారీ కేంద్రంలో ఎంతమంది వున్నారన్న విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు.