శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (19:18 IST)

50 మిలియన్+ వ్యూస్, 1మిలియన్+ లైక్స్ క్రాస్ చేసిన ప్రశాంత్ వర్మ హను-మాన్ టీజర్

Hanuman teser poster
Hanuman teser poster
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్. టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి  తొలి చిత్రంగా వస్తున్న హను-మాన్ అన్ని భాషల ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.  
 
ఈ సినిమా టీజర్తో మేకర్స్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఫ్రేమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లార్డ్ హను మాన్ ప్రజన్స్ అందరికి గూస్బంప్స్ ఇచ్చింది. ప్రశాంత్ వర్మ విజన్, సూపర్ హీరోగా తేజ సజ్జ ఆకట్టుకున్నారు.
 
తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 1మిలియన్+ లైక్స్ తో అరుదైన రికార్ద ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గద్దతో నిలబడి ఉన్న పోస్టర్ అద్భుతంగా ఉంది.
 
శ్రీరాముడి ఆశీస్సులు పొంది టీమ్ ఇటీవలే అయోధ్య నుంచి ప్రచార యాత్రను ప్రారంభించింది.
 
అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా వరలక్ష్మి శరత్కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  
 
ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
 
టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ట్రాక్లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
 
హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.