గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (23:04 IST)

మళ్లీ తాతయ్య కాబోతున్న మెగాస్టార్.. చెర్రీ-ఉపాసన తల్లిదండ్రులు..!? (video)

Ramcharan, Upasana Konidela
మెగాస్టార్ చిరంజీవి తాతయ్య కాబోతున్నారు. అదీ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ద్వారా. అవును మీరు చదువుతున్నది నిజమే. రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్. 
 
ఆ హనుమంతుడి దయతో చెర్రీ దంపతులు త్వరలోనే తమ తొలి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తారని చిరంజీవి చేసి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కాగా,  చెర్రీ- ఉపాసన దంపతులకు 2012లో వివాహం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ దంపతులు ఎప్పుడు శుభవార్త చెప్తారా అంటూ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. చెర్రీ దంపతుల తరపున మెగాస్టార్ ఆ గుడ్ న్యూస్ చెప్పేశారు. 


Ramcharan_upasana
Ramcharan_upasana