శనివారం, 2 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (13:09 IST)

నేడు హీరోయిన్ హన్సిక వివాహం : హాజరయ్యే అతిథులు వీరే

hansika
బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక "దేశముదురు" చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. తనం అందం నటతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకున్నారు. ఆదివారం పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. 
 
తన ప్రియుడు సోహైల్‌ను ఆదివారం పెళ్లాడనుంది. వీరిద్దరి వివాహం జైపూర్ రాజకోటలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరుగుతుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను పంపించారు. 
 
అయితే ఈ ఆహ్వాన పత్రికలు పంపించింది సెలెబ్రిటీలకు మాత్రం కాదండోయ్. కొందరు నిరుపేద చిన్నారులను తన పెళ్లికి ప్రత్యేక అతిథిలుగా ఆహ్వానించింది. పలు ఎన్జీవో సంస్థలతో కలిసి నిరుపేద చిన్నారులకు హన్సిక సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే తన వివాహానికి అలాంటి కొందరు చిన్నారులను సైతం ఆహ్వానించి తన మంచి మనస్సును చాటుకున్నారు. అలాగే, తాను కలిసిన నిరుపేద చిన్నారులు ఉండే ఆశ్రమాలకు కూడా ఆమె భోజనం పంపించేలా ఏర్పాట్లు చేశారు.