ఆదివారం, 26 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

"ఆ నలుగురు" చిత్ర మాటల రచయిత మదన్ ఇకలేరు

madan nomore
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు, ప్రముఖ రచయిత మదన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం దర్శకుడు మదన్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 
 
రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన "ఆ నలుగురు" చిత్రానికి మదన్‌ రచయిత. మదనపల్లిలో జన్మించిన మదన్ "పెళ్లైన కొత్తలో" అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. "గుండె జల్లుమందు", "గరం", "ప్రవరాఖ్యుడు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నటించిన ఆయన చివరి చిత్రం "గాయత్రి". స్క్రీన్ రైటర్, నిర్మాతగా, డైలాగ్ రైటర్ కూడా మదన్ సేవలు అందించారు.