శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (08:32 IST)

టాలీవుడ్ దర్శకుడు మారుతికి పితృవియోగం

maruthi
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కుచలరావు బుధవారం అర్థరాత్రి కన్నమూశారు. ఆయన వయసు 76 యేళ్లు. మచిలీపట్నంలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. మారుతి రావు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో బుధవారం అర్థరాత్రి ఆయన మృతి చెందారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మారుతి అగ్రహీరోల చిత్రాలకు సైతం దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగారు. మారుతి దర్శకత్వంలో వచ్చిన "మంచి రోజులు వచ్చాయి" చిత్రం గత యేడాది నవంబరులో విడుదలైంది. త్వరలో ఆయన తెరకెక్కించిన పక్కా  కమర్షియల్ అనే చిత్రం విడుదల కానుంది. అలాగే, స్టార్ హీరో ప్రభాస్‌తో మరో చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.