గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (12:03 IST)

పూరీ జ‌గ‌న్నాథ్‌ను గాడ్ ఫాద‌ర్ సెట్లో ఆహ్వానించిన చిరంజీవి ఎందుకంటే..!

Puri Chiru
Puri Chiru
నటులు ద‌ర్శ‌కులు అవుతున్నారు. ద‌ర్శ‌కులు న‌టులు కూడా అవుతున్నారు. చేతిలో ప‌నికాబ‌ట్టి త‌మ ద‌ర్శ‌క‌త్వంలో చేసే సినిమాల్లో పూరీ జ‌గ‌న్నాథ్ అలా మెరుస్తుంటాడు. టెంప‌ర్ సినిమాలో ఎన్‌.టి.ఆర్‌.కు బైక్ ఇచ్చే స‌న్నివేశంలో పూరీ న‌టించాడు. ఇలా చాలా మంది ద‌ర్శ‌కులు తెలుగు సీమ‌లో న‌లుటుగా మారారు. కానీ అస‌లు న‌టుడు అవ్వాల‌ని వ‌చ్చిన పూరీ జ‌గ‌న్నాథ్ కోరిక తీర‌లేదు. దాంతో అనుకోకుండా ద‌ర్శ‌కుడు అయి పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు ఓ వేషం ఇచ్చి త‌న సెట్‌లోకి ఆహ్వానించాడు. 
 
Puri Jagannath,  Mohan Raja, NVS. Prasad, Chiranjeevi, Charmi Kaur
Puri Jagannath, Mohan Raja, NVS. Prasad, Chiranjeevi, Charmi Kaur
ఈ సంద‌ర్భంగా చిరంజీవి ఈరోజు ట్వీట్‌లో పేర్కొంటూ,  నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే నేను గాడ్ ఫాద‌ర్‌లో పూరీజ‌గ‌న్నాథ్‌కు స్పెష‌ల్ రోల్ ఇచ్చి ఆహ్వానం ప‌లుకుతున్నానంటూ పేర్కొన్నారు. ఫొటోలో గాడ్ ఫాద‌ర్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా, నిర్మాత ఎన్‌.వి.ఎస్‌. ప్ర‌సాద్‌, చార్మి కౌర్ వున్నారు.