ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (12:48 IST)

అభిమానులకు విజ్ఞప్తి చేసిన వీరసింహారెడ్డి

balayya fans suchana
balayya fans suchana
బాలకష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ని ఈరోజు సాయంత్రం ఒంగోలులో గ్రాండ్‌ గా నిర్వహిస్తున్నారు. ఇందుకు ఓ వేదికను ఎంపిక చేయగా, పోలీసు యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. అందుకే ప్లేస్‌ మార్చి ఆగమేఘాలమీద ఓ కాలేజీ మైదానంలో చేస్తున్నారు. ఇందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా పోలీసులు విధించారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ సూచన చేస్తూ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు.
 
భారీ జన సమూహం, వారి భద్రతను దృష్టిలో ఉంచుకునిమీ పిల్లలను, వృద్ధులను వెంట తీసుకు రావద్దని కోరుతున్నాం. దయచేసి సహకరించండి అంటూ ఈవెంట్‌ నిర్వాహకులు శ్రేయోస్‌ మీడియా ద్వారా తెలియజేశారు. కాగా ట్రైలర్‌ ని సరిగ్గా ఈరోజు సాయంత్రం 8 గం. 17 ని. లకు రిలీజ్‌ చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌ లెవెల్లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.