శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (17:26 IST)

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్ లు పవర్ ఫుల్ గా వుంటాయి : రామ్ లక్ష్మణ్

Ram Laxman
Ram Laxman
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, 'వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' చిత్రాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విశేషాలని పంచుకున్నారు.
 
 మీ యాక్షన్ ప్లాన్ ఎలా వుంటుంది.. యాక్షన్ ని ఎలా డివైడ్ చేసుకుంటారు ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్:  యాక్షన్ ఐడియాలు ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. మా అదృష్టం ఏమిటంటే ఇద్దరం వున్నాం కాబట్టి రెండు ఆప్షన్స్ ని డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళతాం. అందులో ఒక ఆప్షన్ డైరెక్టర్ గారికి నచ్చుతుంది. మేము ఇలానే ప్లాన్ చేసుకుంటాం.
 
ఇప్పుడు ప్రతి ఫైట్ కి కాన్సెప్ట్ వుంటుంది కదా ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుండో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చుని వుంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే  మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్.
 
వీరసింహా రెడ్డిలో చైర్ ఫైట్ లా..వాల్తేరు వీరయ్యలో కాన్సెప్ట్ ఫైట్ ఏమిటి ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి గారు.. ఇంటర్వెల్ లో సడన్ గా రెండు గన్స్ పట్టుకొని స్టయిలీష్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
 
వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ చేయడానికి ఎన్ని రోజుల పట్టింది ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు.
 
బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ ఎలా వుంటుంది ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ టర్కీలో చేశాం. అక్కడ భారీగా ఖర్చయ్యింది. ఫైట్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది.
 
చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' సినిమాలు సంక్రాంతి వస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వుంటాయి. అభిమానులు అంచనాలు అందుకునే విధంగా రెండు సినిమాల్లో యాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా వుండటం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది.
 
చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి'లో ఎమోషన్ ఎలా వుంటుంది ?
బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో అన్నయ్య, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా వుంటుంది. అన్నయ్య అద్భుతంగా చేశారు. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది.
 
ఈ మధ్య పాటలో కూడా యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు కదా ? ఈ ట్రెండ్ ని ఎలా చూస్తారు ?
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: ఇది మాకు సహాయపడే ట్రెండ్. పాటకు ఫైట్ కంపోజ్ చేయడం మాకూ ఒక సవాల్ గా కొత్తగా వుంటుంది.