మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (17:11 IST)

ఇప్పటివరకూ చూడని పాయింట్ వీరసింహారెడ్డి కథలో వుంది : రచయిత సాయి మాధవ్ బుర్రా

Writer Sai Madhav Burra
Writer Sai Madhav Burra
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన రైటర్ సాయి మాధవ్ బుర్రా విలేఖరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
'వీరసింహారెడ్డి' డైలాగ్స్ కంప్లీట్ మాస్ గా వుండబోతున్నాయా ?
'వీరసింహారెడ్డి' లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ  ఇందులో ఉంటాయి.
 
బాలకృష్ణ గారికి డైలాగ్స్ రాస్తున్నపుడు ఒత్తిడి ఫీలయ్యారా ?
బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. ఇప్పుడు  'వీరసింహారెడ్డి'. నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదు.  ఒత్తిడికి లోనైతే అవుట్ పుట్ సరిగ్గా రాదు. కథని పాత్రని సన్నివేశాన్ని  హీరో ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. 'వీరసింహారెడ్డి' కథ చర్చల ప్రారంభం నుండి ఈ ప్రాజెక్ట్ లో వున్నాను.
 
వీరసింహరెడ్డి కథ చెప్పినపుడు అందులో కొత్తగా అనిపించిన పాయింట్ ఏమిటి ?
వీరసింహరెడ్డి కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ వుంది. మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. వీరసింహరెడ్డి ఫుల్ ప్యాకేజ్. బాలకృష్ణ గారి సినిమాల నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.
 
ఇందులో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
నాకు ప్రతి కథ ఒక సవాలే. ఒక సినిమాకి రాస్తున్నపుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో వున్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు. పైగా వీరసింహారెడ్డి కొత్త కథ. ఇందులో అద్భుతమైన సోల్ వుంది. ఈ పాయింట్ వింటే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. కథ వినగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వీరసింహా రెడ్డి కథలో అద్భుతమైన ఎమోషన్ వుంది. వీరసింహా రెడ్డి డైలాగ్స్ రాయడానికి రెండు నెలలు పట్టింది.
 
దర్శకుడికి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ? బాలయ్య గారు ఏమైనా మార్పులు చెప్పారా ?
అవి సహజంగా జరిగిపోతుంటాయి, నాకు అనిపించిది నేను చెబుతూ వుంటాను. బాలయ్య గారిలో వున్న గొప్ప విషయం ఏమిటంటే ఒకసారి కథ కి ఓకే చెప్పిన తర్వాత ఇక అందులో వేలు పెట్టరు.
 
దర్శకుడు గోపిచంద్ మలినేని తో పని చేయడం గురించి ?
గోపిచంద్ మలినేని గారితో నాకిది రెండో సినిమా. మా మధ్య మంచి స్నేహం వుంది. కథ విషయంలో చాలా మంచి చర్చలు జరుగుతాయి. గోపిచంద్ గారు అద్భుతమైన డైరెక్టర్. ఇప్పుడాయన అగ్ర దర్శకుడిగా వున్నారు. భవిష్యత్ లో ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో వుంటారు. తనది అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయనకి కన్విన్స్ అవడం తెలుసు, కన్విన్స్ చేయడం తెలుసు. ఒక గొప్ప దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలివి.
 
గతంలో సంక్రాంతికి బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 విడుదల అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరి సినిమాలు  విడుదలౌతున్నాయి. ఎలా అనిపిస్తుంది ?
బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 నేనే రాశాను. అదొక మర్చిపోలేని క్షణం. ఈ రోజు మరోసారి  బాలకృష్ణ, చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి. ఇదో పండగ. చిరంజీవి గారి సినిమాకి నేను రాయకపోయినా అదీ నా సినిమానే. బాబీ నా స్నేహితుడు. నేను అంటే చిరంజీవి గారికి ఎంతో అభిమానం. ఒకే నిర్మాణ సంస్థ. అదీ నా సినిమాతోనే సమానం.
 
మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?
నేను చూసిన నిర్మాతల్లో అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. వాళ్ళతో ఒకసారి పని చేసిన వారు మళ్ళీ మళ్ళీ పని చేయాలని అనుకుంటారు. సినిమాని బిజినెస్ లా కాకుండా బంధంలా చూస్తారు. అందుకే అంత సక్సెస్ రేట్ లో వున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలు వుంటే ఇండస్ట్రీ పచ్చగా వుంటుంది.
 
దర్శకత్వం పై ఆలోచనలు ఉన్నాయా ?
దర్శకత్వం పై ప్రస్తుతానికి ద్రుష్టి లేదు. రచయిత కావాలని వచ్చాను. రచయితగా వున్నాను.  ఈ ప్రయాణం ఆనందంగా వుంది. భవిష్యత్ లో ఒక కథని దర్శకుడిగా చెప్పాలని అనిపించినపుడు దాని గురించి ఆలోచిస్తాను.
 
 ప్రస్తుతం రాస్తున్న చిత్రాలు ?
ప్రాజెక్ట్ కె, హరిహర వీరమల్లు, రామ్ చరణ్- శంకర్ గారి సినిమా జరుగుతోంది. అలాగే అర్జున్ గారి సినిమా, కెఎస్ రామారావు గారి తో ఒక సినిమా చేస్తున్నా.