సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (16:03 IST)

బాలకృష్ణ బావ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో చెపుతున్న చంద్రికరవి, హనీరోజ్‌ (video)

bava song
bava song
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాలోని ఐటంసాంగ్‌ ‘బావ మనోభావాలు దెబ్బతిన్నాయో..’ పాటను శనివారంనాడు 3.03 నిముషాలకు బాలకృష్న విడుదల చేశారు. హైదరాబాద్‌లోని క్రాస్‌ రోడ్‌లోని సంథ్యా థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేశారు.
 
సాంగ్‌ నేపథ్యం...
జీపులో కలర్‌ డ్రెస్‌లో బాలకృష్ణ, హనీరోజ్‌ ని తీసుకుని స్పీడ్‌గా వచ్చి పంజాబ్‌ దాబా దగ్గర ఆగుతాడు. గోలీషోడా తాగడానికి సిద్ధంగా వుండగా, చంద్రికరవి  తన టీమ్‌తో ఐటెం సాంగ్‌ పాడుతుంది. పక్కా మాస్‌ మసాలా సాంగ్‌తో రూపొందిన ఈ పాట నేపథ్యం ఇలా వుంది. 
‘బా బావ.. బావా.. చుడిదార్‌ ఇష్టమంట ఆడికి. వద్దన్నా ఎండకాలం వేడికి.. వెళ్ళేలోపు ముఖం ముడుకున్నాడో.. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...
బావ బావ.. అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి, అదే రాసుకుళ్ళా ఒంటికి. చూసుకో నానా గత్తర చేసి బయటకు పోయాడు.. మా బావ మనోబావాలు దెబ్బతిన్నాయో.. అంటూ సాగిన ఈ పాటలో బాలకృష్ణ, చంద్రికరవి, హనీరోజ్‌ రెచ్చిపోయి డాన్స్‌ వేశారు.
 
రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాటను సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్‌ ఆలపించారు. థమన్‌ స్వరాలు సమకూర్చారు. శేఖర్‌ వి.జె. కొరియోగ్రఫీ సమకూర్చారు. సినిమాటోగ్రఫీ రిషి పంబాబీ సమకూర్చారు. ఈ పాట బాలకృష్ణ అభిమానులకు ఫిదా చేసింది. మలినేని గోపీచంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.