శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (21:00 IST)

వీరమల్లును వీరసింహారెడ్డి కలిశాడు ఎందుకంటే!

balakrishna, pawan kalyan team
balakrishna, pawan kalyan team
నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి బృందం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో కలిశారు. ఇది చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యుగాల కోసం ఒక ఫ్రేమ్ అంటూ కాప్షన్ కూడా పెట్టింది. నిజంగానే ఇద్దరు హేమాహేమీలు ఇలా కలవడం చాలా విశేషం. ఎందుకు కలిశారు అనేది పూర్తిగా వివరించక పోయినా హైదరాబాద్ శివారులో హరిహర వీరమల్లు, వీరసింహా రెడ్డి చిత్రాల షూటింగ్ పక్క పక్కనే జరుగుతున్నాయని తెలిసింది.
 
కానీ వీరిద్దరూ కలయిక ఫాన్స్‌కు ఫిదా చేసింది. ఇటీవలే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాములో ప్రభాస్‌ని రప్పించారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్‌ను రప్పించే పనిలో ఉన్నారని తెలిసింది. పవన్ వస్తే చాలా విషయాలు ఫ్యాన్స్ కు తెలియాలి. మరి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఎటువంటి కొత్త సమాచారం వస్తుందోనని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.