శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (15:21 IST)

వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ స్పెషల్ సాంగ్ రాబోతున్నది

Veerasimha Reddy's third single still
Veerasimha Reddy's third single still
నందమూరి బాలకృష్ణ నటిసున్న 'వీరసింహారెడ్డి' నుంచి ఫస్ట్  సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ `సుగుణ సుందరి` స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి పాట బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు, ఆల్బమ్ లోని ప్రత్యేక పాట కోసం సమయం వచ్చింది. మేకర్స్ ఇప్పటికే దీనిని 'ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అని పిలవడం ద్వారా తమన్ మన కోసం ఎలాంటి పాటని లోడ్ చేశాడనే క్యూరీయాసిటీ పెంచేసింది. 
 
ఈ పాటని  డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ బ్లాక్ బ్లేజర్, కూల్ సన్ గ్లాసెస్‌ లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ పాటకు 'మా బావ మనోభవాలు' అనే క్యాచి పేరుని పెట్టారు. బాలయ్య రాకింగ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ అంచనాలు మరో స్థాయికి  పెంచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్,  యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు.  
 
ఇంకా దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.