శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (12:42 IST)

ఆహార్యం - అభినయం - ఆంగికాలు కైకాల సొంతం : హీరో బాలకృష్ణ

ఆహార్యం, అభినయం - ఆంగికాలతో అశేష అభిమానలను సొంతం చేసుకున్న నటుడు కైకాల సత్యనారాయణ అని హీరో బాలకృష్ణ అన్నారు. దిగ్గజ నటుడు కైకాల మృతిపై బాలయ్య తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతో పాటు తెలుగువారికి తీరని లోటన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధృవతారను కోల్పోవడం విచారకరమని చెప్పారు. 
 
ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి పౌరాణిక, సాంఘిక, జానపద, కమర్షియల్ చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదన్నారు. భువి నుంచి దివికేగిన సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవాన్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సంతాన్ని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
అలాగే, హీరో మహేష్ బాబు స్పందిస్తూ, కైకాల మరణం మృతి కలచివేస్తుందన్నారు. ఆయనతో కలిసి నటించినప్పటి నుంచి ఎన్నో మధుర జ్ఞపకాలు తనకు ఉన్నాయన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.