సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (08:21 IST)

తెలుగు బిగ్ బాస్ కు బాలకృష్ణ జీవం పోస్తారా!

Balakrishna
Balakrishna
బిగ్ బాస్ అంటేనే అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున గుర్తుకు వస్తారు. కొద్దీ కాలం బాగా సాగిన బిగ్ బాస్ ప్రయాణం సీజన్ 6కు వచ్చే సరికి చాల విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అందులో పార్టిసిపెంట్స్ రాజకీయాలు బయట పడ్డాయి. ఒక రకంగా గేమ్ అంతా మాక్ ఫిక్సింగ్ అనేది కూడా ఎలిమినెట్ అయి  బయటకు వచ్చినవారు కామెంట్ చేసిన ఘటనలు ఉన్నాయి. సో. ఇలాంటి బిగ్ బాస్ కు మరల జోష్ చేపించి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. 
 
బిగ్ బాస్ కు చిరంజీవి కూడా గతంలో వచ్చారు. కానీ ఇప్పుడు  ఆహా ఓటిటి షో అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే సీజన్ 2 తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్న నందమూరి బాలకృష్ణ ను తేవాలని చూస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ చేసిన నాగార్జున ఈసారి బిగ్ బాస్ నుండి నిష్క్రమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నాగ్ స్థానంలో బాలకృష్ణ రావాలంటే ఆహ అగ్రిమెంట్ ప్రకారం అల్లు అరవింద్ అంగీకరించాలి. ఇదంతా అయ్యేసరికి టైం పడుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.  బాలయ్య వీరసింహరెడ్డి సంక్రాంతికి  రిలీజ్ కానుంది.