బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (15:00 IST)

నేనొక నటుడ్ని నాది కానీ జీవితాన్ని సాగిస్తున్నా : మెగాస్టార్ చిరంజీవి (video)

Chiranjeevi
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ నుంచి తన నటన చరిత్రను వినిపించారు. నేనొక నటుడ్ని నాది కానీ జీవితాన్ని సాగిస్తున్నా. నేను పోయిన చిరస్థాయిగా నిలిచిపోయే వాడిని.. అంటూ. మనిషి జీవితం, తన నటనలోని పాత్రలను చిరంజీవి చూపించారు. ఇలా చేయడం కొత్త. దీనిని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) ని విడుదల చేశారు. 
 
బుధవారం రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు.
 
ఈ షాయరీ వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా రాశారు. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయిరీకి ప్రాణం పోశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ సినిమాకు ఈ షాయరీ అద్దం పడుతోంది. 
 
డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.